తెలుగులో ఇస్లాం
నమాజ్ సమయాలుఅన్ని సమయాలు

ఈ-పుస్తకాలు

ఇస్లాం చరిత్ర

తెలుగులో ఇస్లాం • నవంబర్ 22, 2026 2 వీక్షణలు

ఏ చరిత్రలోనైనా మంచివిషయాలతో పాటు చెడువిషయాలు కూడా ఉంటాయి. బుద్ధిమంతులు ఎల్లప్పుడూ మంచినే కాంక్షిస్తారు. కనుక చరిత్ర నుండి మంచిని గ్రహించి గుణపాఠం నేర్చుకొనేవారే ధన్యులు. ముఖ్యంగా ఖుర్‌ఆన్‌లో మనిషికి గుణపాఠం గరిపే ఎన్నో చారిత్రక సత్యాలు ఉన్నాయి. అందుకే బుద్ధిమంతుల కోసం ఖుర్‌ఆన్ ఇలా పేర్కొంటున్నది:

“బుద్ధిజ్ఞానం కలవారికి వీరి చారిత్రక గాథలలో ఎంతో గుణపాఠం ఉంది. ఈ విషయం పుక్కిటిపురాణం కాదు (ఏవైనవి విని ఆచరించేవారికి). ఇది గత గ్రంథాలను ధృవీకరించిన (అంతిమ దైవ)గ్రంథం. ప్రతి విషయాన్ని విశదీకరించి చెప్పే దివ్యవాణి. విశ్వసించేవారికి ఇదొక హితబోధన, కారుణ్యప్రదాయని.” (12:111)

“పూర్వం మేము ఎన్నో జాతులను నిర్మూలించామా మీకు తెలియదా? ఆ జాతులు తమతమ కాలాల్లో ఎంతో వైభవోపేతంగా వెలిగాయి. వాటికి మేము ప్రపంచంలో మీకు ప్రసాదించనంతటి గొప్ప సామ్రాజ్యాలు ప్రసాదించాం. వారి కోసం ఆకాశం నుండి పుష్కలంగా వర్షం కురిపించాం. నేలపై ఎన్నో నదులు ప్రవహించేశాం. (కానీ వారు మా పట్ల కృతఘ్నులయ్యారు.) చివరికి మేము వారు చేసిన పాపాలకు వారిని సమూలంగా తుడిచిపెట్టాం. వారి స్థానంలో ఇతర జాతులను తెచ్చిపెట్టాం.” (6:5-6)

సమీక్షించినవారు: సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రి