సూరా అల్-ఫాతిహా ఖురాన్‌లోని మొదటి సూరా; ఇందులో 7 ఆయత్లు ఉన్నాయి. ఇది నమాజ్‌లో చదివే సూరాల్లో ఒకటి, అందుకే కొత్తగా నేర్చుకునేవారు మొదట దీనితో మొదలుపెడతారు.
ఇక్కడ ప్రతి ఆయత్‌కు మూడు విషయాలు ఇవ్వబడ్డాయి: అరబీ పాఠం, తెలుగు లిపిలో చదివే విధానం (పసుపు పెట్టెలో, లావు అక్షరాలతో), తెలుగు అనువాదం. ప్రతి ఆయత్ కింద ఉన్న ప్లేయర్లో ▶ నొక్కితే మిషారి రాషిద్ అల్-అఫాసి పఠనం ఇక్కడే వినవచ్చు. పైన ఉన్న “అన్నీ వినండి” బటన్ నొక్కితే 7 ఆయత్లూ వరుసగా వినిపిస్తాయి.
ముందుగా, ఈ సూరా ఘనత గురించి ఖురాన్, హదీసులు ఏమి చెబుతున్నాయో చూడండి; ఆ తర్వాత ఆయత్లను ఒక్కొక్కటిగా నేర్చుకోండి.
సూరా అల్-ఫాతిహా ఘనత — ఖురాన్, హదీసులు ఏమి చెబుతున్నాయి
ఖురాన్ 15:87
وَلَقَدْ ءَاتَيْنَـٰكَ سَبْعًا مِّنَ ٱلْمَثَانِى وَٱلْقُرْءَانَ ٱلْعَظِيمَ
తెలుగు లిపిలోవలఖద్ ఆతైనాక సబ్అమ్మినల్ మథానీ వల్ ఖుర్ఆనల్ అజీమ్
మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను ప్రసాదించాము.[1]
వివరణలు
[1] సబ్ ‘అమ్మినల్ మసా’ని. ఈ పేరు సూరహ్ అల్ ఫాతిహా’కు దైవప్రవక్త ము’హమ్మద్ (‘స’అస) స్వయంగా ఇచ్చారు. అది దివ్యఖుర్ఆన్ సారం (ఉమ్ముల్ కితాబ్) అని కూడా అనబడుతుంది. (‘స’హీ’హ్ బు’ఖారీ, కితాబ్ అత్తఫ్సీర్ సూరాహ్ అల్-‘హిజ్ర్). చూడండి, సూరహ్ అల్ ఫాతి’హా (1).
మూలం: ఖురాన్ 15:87 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align
عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عنه سَمِعْتُ رَسُولَ اللهِ صلى الله عليه وسلم يَقُولُ: «قَالَ اللهُ تَعَالَى: قَسَمْتُ الصَّلَاةَ بَيْنِي وَبَيْنَ عَبْدِي نِصْفَيْنِ، وَلِعَبْدِي مَا سَأَلَ، فَإِذَا قَالَ الْعَبْدُ: {الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ}، قَالَ اللهُ تَعَالَى: حَمِدَنِي عَبْدِي، وَإِذَا قَالَ: {الرَّحْمَنِ الرَّحِيمِ}، قَالَ اللهُ تَعَالَى: أَثْنَى عَلَيَّ عَبْدِي، وَإِذَا قَالَ: {مَالِكِ يَوْمِ الدِّينِ}، قَالَ: مَجَّدَنِي عَبْدِي، -وَقَالَ مَرَّةً: فَوَّضَ إِلَيَّ عَبْدِي-، فَإِذَا قَالَ: {إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ}، قَالَ: هَذَا بَيْنِي وَبَيْنَ عَبْدِي وَلِعَبْدِي مَا سَأَلَ، فَإِذَا قَالَ: {اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ، صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ}، قَالَ: هَذَا لِعَبْدِي وَلِعَبْدِي مَا سَأَلَ».
ముఖ్య వాక్యం:
قَالَ اللهُ تَعَالَى: قَسَمْتُ الصَّلَاةَ بَيْنِي وَبَيْنَ عَبْدِي نِصْفَيْنِ، وَلِعَبْدِي مَا سَأَلَ
తెలుగు లిపిలోఖాలల్లాహు తఆలా ఖసమ్తుస్సలాత బైనీ వబైన అబ్దీ నిస్ఫైన్ వలిఅబ్దీ మా సఅల్
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా విన్నానని అన్నారు :- “సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “నేను సలాహ్ ను (నమాజును) నాకూ మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను. మరియు నా దాసుని కొరకు అతడు అర్థించినది (తప్పక) ప్రసాదించబడుతుంది.” (తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు:) “(నమాజులో) దాసుడు “అల్-హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను కీర్తించినాడు”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు”; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: “నా దాసుడు నన్ను మహిమ పరిచినాడు”; ఆయన ఇంకా ఇలా అంటాడు: “నా దాసుడు తన వ్యవహారాలన్నింటినీ నాకు అప్పగించినాడు”; దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, ఆయన “ఇది నాకు, నా దాసునికి మధ్య నున్న విషయం, నా దాసుడు తాను అర్థించిన దానిని పొందుతాడు” అంటాడు, దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “ఇది నా దాసుని కొరకు; నాదాసునికి అతడు అర్థించినది ప్రసాదించబడుతుంది.”
[ప్రామాణికమైన హదీథు] • [ముస్లిం నమోదు చేసినారు:] • మూలం: HadeethEnc.com (v1.29.0) — https://hadeethenc.com/te/browse/hadith/65099
عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ: «بَيْنَمَا جِبْرِيلُ قَاعِدٌ عِنْدَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ سَمِعَ نَقِيضًا مِنْ فَوْقِهِ، فَرَفَعَ رَأْسَهُ، فَقَالَ: هَذَا بَابٌ مِنَ السَّمَاءِ فُتِحَ الْيَوْمَ لَمْ يُفْتَحْ قَطُّ إِلَّا الْيَوْمَ، فَنَزَلَ مِنْهُ مَلَكٌ، فَقَالَ: هَذَا مَلَكٌ نَزَلَ إِلَى الْأَرْضِ لَمْ يَنْزِلْ قَطُّ إِلَّا الْيَوْمَ، فَسَلَّمَ، وَقَالَ: أَبْشِرْ بِنُورَيْنِ أُوتِيتَهُمَا لَمْ يُؤْتَهُمَا نَبِيٌّ قَبْلَكَ: فَاتِحَةُ الْكِتَابِ، وَخَوَاتِيمُ سُورَةِ الْبَقَرَةِ، لَنْ تَقْرَأَ بِحَرْفٍ مِنْهُمَا إِلَّا أُعْطِيتَهُ».
ముఖ్య వాక్యం:
أَبْشِرْ بِنُورَيْنِ أُوتِيتَهُمَا لَمْ يُؤْتَهُمَا نَبِيٌّ قَبْلَكَ: فَاتِحَةُ الْكِتَابِ، وَخَوَاتِيمُ سُورَةِ الْبَقَرَةِ، لَنْ تَقْرَأَ بِحَرْفٍ مِنْهُمَا إِلَّا أُعْطِيتَهُ
తెలుగు లిపిలోఅబ్షిర్ బినూరైని ఊతీతహుమా లమ్ యుఉతహుమా నబియ్యున్ ఖబ్లక్ ఫాతిహతుల్ కితాబ్ వఖవాతీము సూరతిల్ బఖరహ్ లన్ తఖ్రఅ బిహర్ఫిన్ మిన్హుమా ఇల్లా ఉఉతీతహ్
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉన్నపుడు పైన ‘కిర్రు’ మనే శబ్దం విన్నారు. ఆయన తన తలపైకి ఎత్తి చూసి, ఇలా అన్నారు: “ఇది స్వర్గములోని ఒక ద్వారము; అది ఈ రోజు తెరుచుకున్నది, ఈ రోజు తప్ప ఇంతకు మునుపు ఎన్నడూ ఆ ద్వారము తెరువబడలేదు”; ఆ ద్వారము నుండి ఒక దైవదూత దిగి వచ్చినాడు. ఆయన (జిబ్రీల్) ఇలా అన్నారు: “ఆయన దైవదూత, ఆ దైవదూత ఈ రోజే భూమిపై దిగివచ్చినాడు, ఈ దినము తప్ప ఇంతకు మునుపు ఎన్నడూ అతడు భూమి మీదకు రాలేదు. అతడు (ఆ దైవదూత) సలాం చేసి ఇలా అన్నాడు: “మీకు ప్రసాదించబడుతున్న రెండు కాంతి పుంజముల శుభవార్తను స్వీకరించండి; మీకు ముందు ఏ సందేశహరునికీ ఇవి ఇవ్వబడలేదు: ‘ఫాతిహతుల్ కితాబ్’ (సూరహ్ ఫాతిహా), మరియు సూరహ్ అల్ బఖరహ్ యొక్క చివరి ఆయతులు. దాని నుండి మీరు ఒక్క అక్షరం పఠించినా అది (దాని ప్రతిఫలం) మీకు ఇవ్వబడుతుంది.”
[ప్రామాణికమైన హదీథు] • [ముస్లిం నమోదు చేసినారు:] • మూలం: HadeethEnc.com (v1.29.0) — https://hadeethenc.com/te/browse/hadith/5775
عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الكِتَابِ».
ముఖ్య వాక్యం:
لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الكِتَابِ
తెలుగు లిపిలోలా సలాత లిమన్ లమ్ యఖ్రఅ బిఫాతిహతిల్ కితాబ్
ఉబాదహ్ ఇబ్న్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఫాతిహతిల్ కితాబ్” (అంటే సూరహ్ అల్ ఫాతిహా) పఠించని వాని సలాహ్ (నమాజు) కాదు” (అనగా చెల్లదు, స్వీకారయోగ్యము కాదు).
[ప్రామాణికమైన హదీథు] • [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] • మూలం: HadeethEnc.com (v1.29.0) — https://hadeethenc.com/te/browse/hadith/5378
ఖురాన్ 1:1
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
తెలుగు లిపిలోబిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్[1] పేరుతో[2]
వివరణలు
[1] అల్లాహ్ సుబ్’హానవతా’ఆలా (సు.తా.):అనేది సర్వసృష్టికర్త, మహాన్నతుడు, సర్వపోషకుడు అయిన విశ్వప్రభువు యొక్క పేరు. ఈ పేరుతో ఆయనను తప్ప మరెవ్వరినీ పిలువరాదు. దీనికి సరిసమానమైన పదం వేరే భాషలలో లేదు, ఫార్సీ భాషలోని ‘ఖుదా అనే పదం తప్ప. ఇది ఒక ప్రత్యేకమైన విశేషపదం. ఈ పదానికి బహువచనం గానీ, స్త్రీలింగం గానీ లేవు. అల్లాహ్ (సు.తా.) యొక్క స్పష్టమైన నిర్వచనం కొరకు చూడండి, సూరహ్ అల్-ఇ’ఖ్లాస్(112).
[2] చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయంలో, ఈ ఆయత్, సూరహ్ అల్ ఫాతి’హా యొక్క భాగం. సూరహ్ అన్ నమ్ల్ (27:30) లో ఇది ఒక ఆయత్ రూపంలో కూడా ఉంది. ప్రతి మంచి పనికి ముందు బిస్మిల్లా హిర్’హ్ మా నిర్ర’హీమ్, చదవాలి. ఉదా: భోజనానికి ముందు, వ’దూ చేసేటప్పుడు. ఖుర్ఆన్ పఠించటం ప్రారంభించేటప్పుడు బిస్మిల్లా హిర్ర’హ్ మా నిర్ర’హీమ్ కు ముందు అ’ఊజు’ బిల్లాహి మినష్షయ్’తా నిర్రజీమ్ – శపించ(బహిష్కరించ)బడిన షైతాన్ నుండి రక్షించబడటానికి నేను అల్లాహ్ (సు.తా.) శరణు వేడుకుంటున్నాను – తప్పక చదవాలి. (చూడండి అల్లాహుతా ‘ఆలా ఆదేశం, 16:98). దివ్యఖుర్ఆన్ మానవులకు మార్గదర్శిని మరియు హృదయాలకు స్వస్థతనిచ్చేది. షై’తాన్ మార్గభ్రష్టత్వానికి మరియు దురాచారాలకు ప్రోత్సహిస్తాడు. కావున శపించ(బహిష్కరించ)బడిన షై’తాన్ మరియు అతడి అనుచర మూకలు రేకెత్తించే కలతల నుండి కాపాడుకోవటానికి అల్లాహుతా’ఆలా శరణు వేడుకోవాలి. ఈ ఇస్తి’ఆజ’హ్ దివ్యఖుర్ఆన్ యొక్క భాగం కాదనటంలో ఇస్లామీయ శాస్త్రవేత్తలు అందరూ ఏకీభవిస్తున్నారు. కాబట్టి ఇది దివ్యఖుర్ఆన్ లో వ్రాయబడలేదు.
ఖురాన్ 1:2
ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ
తెలుగు లిపిలోఅల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్
సర్వలోకాలకు ప్రభువైన[1] అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు[2].
వివరణలు
[1] రబ్బున్: ప్రభువు, అనే పదానికి తెలుగులో సరితూగే పదం లేదు. దీనికి సర్వలోకాల ఏకైక ప్రభువు, వాటి సృష్టికర్త, పోషకుడు, సంరక్షకుడు, యజమాని, సర్వవర ప్రదాత అనే అర్థాలున్నాయి. చాలా వరకు తెలుగు అనువాదాలలో వాటినట్లు ఈ అనువాదంలో కూడా ప్రభువు అనే పదమే వాడబడింది. [2] ‘హదీస్’లో వచ్చింది: లా ఇలాహ ఇల్లల్లాహ్ – అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. అతి ఉత్తమమైన జిక్ర్ (Meditation), జ్ఞాపిక, స్మరణ, ధ్యానం మరియు అల్’హమ్దులిల్లాహ్ – సమస్త స్తోత్రాలకు అర్హుడు అల్లాహుతా’ఆలా మాత్రమే, అతి ఉత్తమమైన దు’ఆ’ – ప్రార్థన (తిర్మిజీ’, నసాయీ’ మొదలైన వారు).
ఖురాన్ 1:3
ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
తెలుగు లిపిలోఅర్రహ్మానిర్రహీమ్
అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత[1]
వివరణలు
[1] అర్-ర’హ్మాన్: అనంత కరుణామయుడు, అంటే ఇహలోకంలో భేదభావాలు లేకుండా అందరికీ ఎల్లప్పుడూ కరుణను పంచేవాడు. అర్-ర’హీమ్: అంటే పరలోకంలో కేవలం ఆయనను విశ్వసించిన వారికే కరుణాప్రదాత, అని కొందరు వ్యాఖ్యానించారు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
ఖురాన్ 1:4
مَـٰلِكِ يَوْمِ ٱلدِّينِ
తెలుగు లిపిలోమాలికి యౌమిద్దీన్
తీర్పుదినానికి[1] స్వామి[2].
వివరణలు
[1] యౌముద్దీన్: తీర్పుదినం, అంటే పునరుత్థానదినం. ఆ దినపు యజమాని కేవలం ఆ ఒకే ఒక్క ఆరాధ్యదేవుడు అల్లాహ్ (సు.తా.) మాత్రమే. ఆ రోజు ప్రతివానికి, తన కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవ్వరికీ ఏ విధమైన అన్యాయం జరుగదు. ఆ రోజు, అల్లాహుతా’ఆలా అనుమతించిన వాడు తప్ప మరెవ్వరికీ మాట్లాడే హక్కు ఉండదు. వారు దైవదూతలు గానీ లేక ప్రవక్త (‘అలైహిమ్ స.) లు గానీ కావచ్చు. వారు అల్లాహ్ (సు.తా.) అనుమతించిన వారి కొరకు మాత్రమే సిఫారసు చేస్తారు. [2] మాలిక్: Master, Owner, ప్రతిదాని నిజ స్వామి, యజమాని, కర్త, పెద్ద, నాయకుడు అనే అర్థాలున్నాయి. చూడండి, 20:114 వ్యాఖ్యానం 2.
ఖురాన్ 1:5
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
తెలుగు లిపిలోఇయ్యాక నఅబుదు వఇయ్యాక నస్తఈన్
మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.[1]
వివరణలు
[1] ‘ఇబాదతున్: ఆరాధన, అంటే ఒకరి ప్రసన్నత కొరకు అత్యంత వినయ విధేయత, నమ్రత, మరియు భీతిని ప్రదర్శించటం. ఇది కేవలం అల్లాహ్ (సు.తా.) కొరకు మాత్రమే తగినది. మానవుడు కేవలం ఆ ఒకే ఒక్క ఆరాధ్య దైవం అయిన అల్లాహుతా’ఆలాను మాత్రమే ఆరాధించాలి. మరియు ప్రతి విషయం, ప్రతి కార్యంలో కేవలం ఆయన సహాయాన్నే అర్థించాలి. తౌ’హీద్: మూడు విధాలు – (1) తౌ’హీద్ అర్-రుబూబియ్యహ్: ఏకైక ప్రభువు అల్లాహ్ (సు.తా.) అని విశ్వసించటం. సర్వాన్ని సృష్టించినవాడు, దాని అధిపతి, సర్వ వ్యవహారాలను నడిపించేవాడు మరియు పోషకుడు కేవలం ఆ ఏకైక ప్రభువు అయిన అల్లాహుతా’ఆలా మాత్రమే అని, విశ్వసించడం. కాని బహుదైవారాధకులు (ముష్రికులు) దీనిని నమ్మి కూడా ఆయనకు సాటి కల్పిస్తున్నారు. ఎంత తప్పుడు మార్గంలో పడి ఉన్నారు వారు! చూడండి, 10:31, 39:38, 23:84-89. (2) తౌ’హీద్ అల్-‘ఉలూహియ్యహ్: ప్రతి విధమైన ఆరాధనకు అర్హుడు కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే. ఆరాధన అంటే అల్లాహుతా’ఆలా ప్రీతి లేక భయం కొరకు చేసే ప్రతి కార్యం. కావున, నమా’జ్, ఉపవాసం, ‘జకాత్ మొదలైనవి, ఆ గొప్ప శక్తి (అల్లాహుతా’ఆలా) ప్రీతి కొరకే చేయటం. ఆరాధనలన్నింటికీ అర్హుడు, కేవలం అల్లాహ్ (సు.తా.) అని విశ్వసించటం. (3) తౌహీద్ అల్-అస్మా’వస్సిఫాత్: అల్లాహుతా’ఆలా పేర్లు మరియు గుణవిశేషాలను ఏ విధమైన మార్పు చేయకుండా విశ్వసించడం. అల్లాహుతా’ఆలా తప్ప ఇతరులను ఈ గుణవిశేషాలతో సంబోధించరాదు. అల్లాహ్ (సు.తా.) మరియు ఆయన ప్రవక్త (‘స’అస) వివరించిన పేర్లు మరియు గుణవిశేషాలతో తప్ప ఇతర పేర్లతో ఆయనను సంబోధించరాదు.
ఖురాన్ 1:6
ٱهْدِنَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ
తెలుగు లిపిలోఇహ్దినస్సిరాతల్ ముస్తఖీమ్
మాకు ఋజుమార్గం[1] వైపునకు మార్గదర్శకత్వం చేయి.
వివరణలు
[1] ఋజుమార్గం అంటే, అంతులేని సర్వసుఖసంతోషాలు గల శాశ్వత స్వర్గాన్ని పొందే మార్గం. దానిని పొందటానికి మానవుడు తన ఆరాధనను కేవలం అల్లాహ్ (సు.తా.) కే ప్రత్యేకించుకొని, సత్కార్యాలు చేయాలి. అల్లాహుతా’ఆలాను తప్ప మరెవ్వరినీ ఆరాధ్యదైవాలుగా చేసుకోరాదు.
ఖురాన్ 1:7
صِرَٰطَ ٱلَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ ٱلْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا ٱلضَّآلِّينَ
తెలుగు లిపిలోసిరాతల్లదీన అన్అమ్త అలైహిమ్ గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్
నీవు అనుగ్రహించిన[1] వారి మార్గం (మాత్రమే చూపు) నీ ఆగ్రహానికి[2] గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.
వివరణలు
[1] అల్లాహ్ (సు.తా.) అనుగ్రహించిన వారి మార్గం అంటే, దైవప్రవక్తల, వారిని అనుసరించిన సత్పురుషుల మరియు పుణ్యపురుషుల మార్గం. వారు సన్మార్గం పొంది, దానిపైననే నడిచారు. అదే అల్లాహుతా’ఆలాకు విధేయులవటం (ఇస్లాం). అదే స్వర్గానికి అర్హులు చేసే మార్గం. అల్లాహ్ (సు.తా.) ఆదేశం: “మరియు ఎవరు అల్లాహుతా’ఆలాకు, మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ (సు.తా.) అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్యవంతులతోనూ, అల్లాహుతా’ఆలా ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరు(షహీద్)లతోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది.” (4:69) [2] మ’గ్దూబి ‘అలైహిమ్: అల్లాహ్ (సు.తా.) ఆగ్రహానికి గురైనవారు అంటే – యూదులు. ఎందుకంటే వారు బుద్ధిపూర్వకంగా సన్మార్గాన్ని త్యజించారు. దివ్యసూచనలను మార్చారు. ‘ఉ’జైర్ (‘అ.స.)ను, అల్లాహుతా’ఆలా కుమారుడు అన్నారు. తమ విద్వాంసుల (అ’హ్బారు) లకు ధర్మసమ్మతం (‘హలాల్) మరియు నిషిద్ధం (‘హరామ్) చేసే హక్కు ఉందన్నారు. ‘దాల్లీన్: మార్గభ్రష్టులైనవారు – అంటే క్రైస్తవులు. ఎందుకంటే వారు ‘ఈసా మసీ’హ్ (ఏసూ క్రీస్తు ‘అ.స.)ను అల్లాహ్ (సు.తా.) కుమారుడు అని కొందరు మరియు ముగ్గురు ఆరాధ్యదైవా(Trinity)లలో ఒకరు అని మరికొందరు అన్నారు, (ఫ’త్హ్ అల్-ఖదీర్). ఆమీన్: ఓ అల్లాహ్ (సు.తా.)! మా దు’ఆ (ప్రార్థన)ను అంగీకరించు. సూరహ్ అల్ ఫాతి’హా తరువాత ఆమీన్ అనటాన్ని దైవప్రవక్త (‘స’అస) ఎంతో ప్రాధాన్యత నిచ్చారు మరియు ఎంతో ఉత్తమమైనదని అన్నారు. దీనిని ముందు నిలిచి నమా’జ్ చేయించేవాడు (ఇమామ్) మరియు ఇమామ్ వెనుక నమా’జ్ చేసేవారు (ముఖ్త’దీలు) అందరూ అనాలి. పెద్ద స్వరంతో చదివే నమా’జ్ లలో పెద్ద స్వరంతో అనాలి (ఇబ్నె-మాజా, ఇబ్నె-కసీ’ర్).
మూలం: ఖురాన్ 1:1–7 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align
చదవడం నేర్చుకునే చిట్కాలు:
• ఒకేసారి ఒక ఆయత్‌ను, నెమ్మదిగా నేర్చుకోండి; వచ్చేంతవరకు మళ్లీ మళ్లీ చెప్పండి.
• తెలుగు లిపిలో ఇచ్చినది చదవడానికి సహాయం మాత్రమే. సరైన ఉచ్చారణ కోసం ఉపాధ్యాయుని వద్ద వినండి, ఆయనకు చదివి వినిపించండి.
• అర్థం తెలుసుకుని చదివితే మనసుకు హత్తుకుంటుంది.
• సందేహాలు ఉంటే ఈ సైట్‌లోని “ప్రశ్న అడగండి” పేజీ ఉపయోగించండి.
అల్లాహ్ మీ ప్రయాణాన్ని సులభం చేయుగాక.