అల్-ఫాతిహా ఖురాన్లోని మొదటి సూరా. ఇందులో ఏడు ఆయతులు ఉన్నాయి. ప్రతి నమాజ్ రకాత్లో దీన్ని చదువుతారు.
ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ
తెలుగు లిపిలో:
అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్
సర్వలోకాలకు ప్రభువైన[1] అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు[2].
వివరణలు
[1] రబ్బున్: ప్రభువు, అనే పదానికి తెలుగులో సరితూగే పదం లేదు. దీనికి సర్వలోకాల ఏకైక ప్రభువు, వాటి సృష్టికర్త, పోషకుడు, సంరక్షకుడు, యజమాని, సర్వవర ప్రదాత అనే అర్థాలున్నాయి. చాలా వరకు తెలుగు అనువాదాలలో వాటినట్లు ఈ అనువాదంలో కూడా ప్రభువు అనే పదమే వాడబడింది. [2] ‘హదీస్’లో వచ్చింది: లా ఇలాహ ఇల్లల్లాహ్ – అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. అతి ఉత్తమమైన జిక్ర్ (Meditation), జ్ఞాపిక, స్మరణ, ధ్యానం మరియు అల్’హమ్దులిల్లాహ్ – సమస్త స్తోత్రాలకు అర్హుడు అల్లాహుతా’ఆలా మాత్రమే, అతి ఉత్తమమైన దు’ఆ’ – ప్రార్థన (తిర్మిజీ’, నసాయీ’ మొదలైన వారు).
మూలం: ఖురాన్ 1:2 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net