తెలుగులో ఇస్లాం
నమాజ్ సమయాలుఅన్ని సమయాలు

ఖురాన్ అర్థం

సూరా అల్-ఇఖ్లాస్ — భావం

తెలుగులో ఇస్లాం • నవంబర్ 10, 2026 4 వీక్షణలు

ఖురాన్ 112:1

قُلْ هُوَ ٱللَّهُ أَحَدٌ

తెలుగు లిపిలో:
ఖుల్ హువల్లాహు అహద్

ఇలా అను: “ఆయనే అల్లాహ్! ఏకైకుడు.[1]

వివరణలు

[1] అ’హదున్: The One and Alone, ఏకైకుడు.

ఖురాన్ 112:2

ٱللَّهُ ٱلصَّمَدُ

తెలుగు లిపిలో:
అల్లాహుస్సమద్

ఎవరి అక్కరా లేని వాడు, (సర్వులూ ఆయనపైనే ఆధారపడతారు).[1]

వివరణలు

[1] అ’స్సమదు: Absolute, Eternal, Besought of All, to Whom obedience is rendered. Without whom no affair is accomplished సమస్త వ్యవహారాలు తన మీదనే ఆధారపడి ఉన్నవాడు, నిత్యుడు, శాశ్వతుడు, నిరంతరుడు. అందరూ ఆయనపై ఆధారపడి ఉన్నారు. ఆయనకు ఎవ్వరి అక్కర లేదు. ఆయన నిరపేక్షుడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.

ఖురాన్ 112:3

لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ

తెలుగు లిపిలో:
లమ్ యలిద్ వలమ్ యూలద్

ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.

ఖురాన్ 112:4

وَلَمْ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدٌۢ

తెలుగు లిపిలో:
వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్

మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు.”[1]

వివరణలు

[1] లైస క మిస్’లిహీ షయ్ఉన్’ 42:11. ఒక ‘హదీస్’ఖుద్సీ: “మానవుడు నన్ను దూషిస్తాడు, అంటే నాకు సంతానాన్ని అంటగడతాడు. వాస్తవానికి నేను, ఒక్కడను, అద్వితీయుడను. ఎవరి అక్కరలేని వాడను, నేను ఎవ్వరినీ కనలేదు మరియు నేను కూడా ఎవ్వరికీ పుట్టలేదు. నాకు సరిసమానమైనవాడు గానీ నాతో పోల్చదగినవాడు గానీ ఎవ్వడూ లేడు,” (‘స. బు’ఖారీ).

మూలం: ఖురాన్ 112:1–4 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net

ఈ సూరా ఖురాన్‌లో మూడో వంతుతో సమానమని ప్రవక్త ﷺ తెలిపారు.