عن عبد الله بن عمرو رضي الله عنهما قال: لَمْ يَكُنِ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَاحِشًا وَلَا مُتَفَحِّشًا، وَكَانَ يَقُولُ: «إِنَّ مِنْ خِيَارِكُمْ أَحْسَنَكُمْ أَخْلَاقًا».
ముఖ్య వాక్యం:
إِنَّ مِنْ خِيَارِكُمْ أَحْسَنَكُمْ أَخْلَاقًا
తెలుగు లిపిలో:
ఇన్న మిన్ ఖియారికుమ్ అహ్సనకుమ్ అఖ్లాఖా
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అశ్లీల, అసభ్య వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాదు. ఆయనెప్పుడూ అశ్లీల, అసభ్య భాషను ఉపయోగించలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిశ్చయంగా మీలో ఎవరైతే ఉత్తమ నడవడిక కలిగి ఉంటారో, వారే ఉత్తములు”.
[ప్రామాణికమైన హదీథు] • [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] • మూలం: HadeethEnc.com (v1.29.0) — https://hadeethenc.com/te/browse/hadith/5803
నమాజ్, ఉపవాసం ఎంత ముఖ్యమో మంచి నడవడిక కూడా అంతే ముఖ్యం. నిజాయితీ, సహనం, దయ, ఇతరుల పట్ల గౌరవం — ఇవి విశ్వాసి లక్షణాలు.