తెలుగులో ఇస్లాం
నమాజ్ సమయాలుఅన్ని సమయాలు

చదివే అభ్యాసం — చిన్న సూరాలు

పాఠం 17 / 17 • ఈ పాఠంలో 244 ఖురాన్ పదాలు

ఈ పాఠం తెరవడానికి, ముందు పాఠం అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణులు కావాలి.

ముందు పాఠానికి వెళ్లండి

తెలుగు లిపిలో ఇచ్చినది సహాయం మాత్రమే; సరైన ఉచ్చారణ కోసం ఉపాధ్యాయుని వద్ద వినండి.

ఇప్పుడు నేర్చుకున్నవన్నీ నిజమైన సూరాల్లో ఉపయోగించండి. ప్రతి ఆయత్‌కు: అరబీ పాఠం (పఠనం వినిపిస్తున్నప్పుడు పదాలు వెలుగుతాయి), తెలుగు లిపిలో చదివే విధానం, తెలుగు అనువాదం ఉన్నాయి. ముందు ప్లేయర్‌లో ఆయత్ విని, తర్వాత మీరే చదవండి.

1. సూరా అల్-ఫాతిహా — 7 ఆయత్‌లు

ఖురాన్ 1:1

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

తెలుగు లిపిలోబిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్[1] పేరుతో[2]

వివరణలు

[1] అల్లాహ్ సుబ్'హానవతా'ఆలా (సు.తా.):అనేది సర్వసృష్టికర్త, మహాన్నతుడు, సర్వపోషకుడు అయిన విశ్వప్రభువు యొక్క పేరు. ఈ పేరుతో ఆయనను తప్ప మరెవ్వరినీ పిలువరాదు. దీనికి సరిసమానమైన పదం వేరే భాషలలో లేదు, ఫార్సీ భాషలోని 'ఖుదా అనే పదం తప్ప. ఇది ఒక ప్రత్యేకమైన విశేషపదం. ఈ పదానికి బహువచనం గానీ, స్త్రీలింగం గానీ లేవు. అల్లాహ్ (సు.తా.) యొక్క స్పష్టమైన నిర్వచనం కొరకు చూడండి, సూరహ్ అల్-ఇ'ఖ్లాస్(112).
[2] చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయంలో, ఈ ఆయత్, సూరహ్ అల్ ఫాతి'హా యొక్క భాగం. సూరహ్ అన్ నమ్ల్ (27:30) లో ఇది ఒక ఆయత్ రూపంలో కూడా ఉంది. ప్రతి మంచి పనికి ముందు బిస్మిల్లా హిర్'హ్ మా నిర్ర'హీమ్, చదవాలి. ఉదా: భోజనానికి ముందు, వ'దూ చేసేటప్పుడు. ఖుర్ఆన్ పఠించటం ప్రారంభించేటప్పుడు బిస్మిల్లా హిర్ర'హ్ మా నిర్ర'హీమ్ కు ముందు అ'ఊజు' బిల్లాహి మినష్షయ్'తా నిర్రజీమ్ - శపించ(బహిష్కరించ)బడిన షైతాన్ నుండి రక్షించబడటానికి నేను అల్లాహ్ (సు.తా.) శరణు వేడుకుంటున్నాను - తప్పక చదవాలి. (చూడండి అల్లాహుతా 'ఆలా ఆదేశం, 16:98). దివ్యఖుర్ఆన్ మానవులకు మార్గదర్శిని మరియు హృదయాలకు స్వస్థతనిచ్చేది. షై'తాన్ మార్గభ్రష్టత్వానికి మరియు దురాచారాలకు ప్రోత్సహిస్తాడు. కావున శపించ(బహిష్కరించ)బడిన షై'తాన్ మరియు అతడి అనుచర మూకలు రేకెత్తించే కలతల నుండి కాపాడుకోవటానికి అల్లాహుతా'ఆలా శరణు వేడుకోవాలి. ఈ ఇస్తి'ఆజ'హ్ దివ్యఖుర్ఆన్ యొక్క భాగం కాదనటంలో ఇస్లామీయ శాస్త్రవేత్తలు అందరూ ఏకీభవిస్తున్నారు. కాబట్టి ఇది దివ్యఖుర్ఆన్ లో వ్రాయబడలేదు.

ఖురాన్ 1:2

ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ

తెలుగు లిపిలోఅల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్

సర్వలోకాలకు ప్రభువైన[1] అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు[2].

వివరణలు

[1] రబ్బున్: ప్రభువు, అనే పదానికి తెలుగులో సరితూగే పదం లేదు. దీనికి సర్వలోకాల ఏకైక ప్రభువు, వాటి సృష్టికర్త, పోషకుడు, సంరక్షకుడు, యజమాని, సర్వవర ప్రదాత అనే అర్థాలున్నాయి. చాలా వరకు తెలుగు అనువాదాలలో వాటినట్లు ఈ అనువాదంలో కూడా ప్రభువు అనే పదమే వాడబడింది. [2] 'హదీస్'లో వచ్చింది: లా ఇలాహ ఇల్లల్లాహ్ - అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. అతి ఉత్తమమైన జిక్ర్ (Meditation), జ్ఞాపిక, స్మరణ, ధ్యానం మరియు అల్'హమ్దులిల్లాహ్ - సమస్త స్తోత్రాలకు అర్హుడు అల్లాహుతా'ఆలా మాత్రమే, అతి ఉత్తమమైన దు'ఆ' - ప్రార్థన (తిర్మిజీ', నసాయీ' మొదలైన వారు).

ఖురాన్ 1:3

ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

తెలుగు లిపిలోఅర్రహ్మానిర్రహీమ్

అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత[1]

వివరణలు

[1] అర్-ర'హ్మాన్: అనంత కరుణామయుడు, అంటే ఇహలోకంలో భేదభావాలు లేకుండా అందరికీ ఎల్లప్పుడూ కరుణను పంచేవాడు. అర్-ర'హీమ్: అంటే పరలోకంలో కేవలం ఆయనను విశ్వసించిన వారికే కరుణాప్రదాత, అని కొందరు వ్యాఖ్యానించారు. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.

ఖురాన్ 1:4

مَـٰلِكِ يَوْمِ ٱلدِّينِ

తెలుగు లిపిలోమాలికి యౌమిద్దీన్

తీర్పుదినానికి[1] స్వామి[2].

వివరణలు

[1] యౌముద్దీన్: తీర్పుదినం, అంటే పునరుత్థానదినం. ఆ దినపు యజమాని కేవలం ఆ ఒకే ఒక్క ఆరాధ్యదేవుడు అల్లాహ్ (సు.తా.) మాత్రమే. ఆ రోజు ప్రతివానికి, తన కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవ్వరికీ ఏ విధమైన అన్యాయం జరుగదు. ఆ రోజు, అల్లాహుతా'ఆలా అనుమతించిన వాడు తప్ప మరెవ్వరికీ మాట్లాడే హక్కు ఉండదు. వారు దైవదూతలు గానీ లేక ప్రవక్త ('అలైహిమ్ స.) లు గానీ కావచ్చు. వారు అల్లాహ్ (సు.తా.) అనుమతించిన వారి కొరకు మాత్రమే సిఫారసు చేస్తారు. [2] మాలిక్: Master, Owner, ప్రతిదాని నిజ స్వామి, యజమాని, కర్త, పెద్ద, నాయకుడు అనే అర్థాలున్నాయి. చూడండి, 20:114 వ్యాఖ్యానం 2.

ఖురాన్ 1:5

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ

తెలుగు లిపిలోఇయ్యాక నఅబుదు వఇయ్యాక నస్తఈన్

మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.[1]

వివరణలు

[1] 'ఇబాదతున్: ఆరాధన, అంటే ఒకరి ప్రసన్నత కొరకు అత్యంత వినయ విధేయత, నమ్రత, మరియు భీతిని ప్రదర్శించటం. ఇది కేవలం అల్లాహ్ (సు.తా.) కొరకు మాత్రమే తగినది. మానవుడు కేవలం ఆ ఒకే ఒక్క ఆరాధ్య దైవం అయిన అల్లాహుతా'ఆలాను మాత్రమే ఆరాధించాలి. మరియు ప్రతి విషయం, ప్రతి కార్యంలో కేవలం ఆయన సహాయాన్నే అర్థించాలి. తౌ'హీద్: మూడు విధాలు - (1) తౌ'హీద్ అర్-రుబూబియ్యహ్: ఏకైక ప్రభువు అల్లాహ్ (సు.తా.) అని విశ్వసించటం. సర్వాన్ని సృష్టించినవాడు, దాని అధిపతి, సర్వ వ్యవహారాలను నడిపించేవాడు మరియు పోషకుడు కేవలం ఆ ఏకైక ప్రభువు అయిన అల్లాహుతా'ఆలా మాత్రమే అని, విశ్వసించడం. కాని బహుదైవారాధకులు (ముష్రికులు) దీనిని నమ్మి కూడా ఆయనకు సాటి కల్పిస్తున్నారు. ఎంత తప్పుడు మార్గంలో పడి ఉన్నారు వారు! చూడండి, 10:31, 39:38, 23:84-89. (2) తౌ'హీద్ అల్-'ఉలూహియ్యహ్: ప్రతి విధమైన ఆరాధనకు అర్హుడు కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే. ఆరాధన అంటే అల్లాహుతా'ఆలా ప్రీతి లేక భయం కొరకు చేసే ప్రతి కార్యం. కావున, నమా'జ్, ఉపవాసం, 'జకాత్ మొదలైనవి, ఆ గొప్ప శక్తి (అల్లాహుతా'ఆలా) ప్రీతి కొరకే చేయటం. ఆరాధనలన్నింటికీ అర్హుడు, కేవలం అల్లాహ్ (సు.తా.) అని విశ్వసించటం. (3) తౌహీద్ అల్-అస్మా'వస్సిఫాత్: అల్లాహుతా'ఆలా పేర్లు మరియు గుణవిశేషాలను ఏ విధమైన మార్పు చేయకుండా విశ్వసించడం. అల్లాహుతా'ఆలా తప్ప ఇతరులను ఈ గుణవిశేషాలతో సంబోధించరాదు. అల్లాహ్ (సు.తా.) మరియు ఆయన ప్రవక్త ('స'అస) వివరించిన పేర్లు మరియు గుణవిశేషాలతో తప్ప ఇతర పేర్లతో ఆయనను సంబోధించరాదు.

ఖురాన్ 1:6

ٱهْدِنَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ

తెలుగు లిపిలోఇహ్దినస్సిరాతల్ ముస్తఖీమ్

మాకు ఋజుమార్గం[1] వైపునకు మార్గదర్శకత్వం చేయి.

వివరణలు

[1] ఋజుమార్గం అంటే, అంతులేని సర్వసుఖసంతోషాలు గల శాశ్వత స్వర్గాన్ని పొందే మార్గం. దానిని పొందటానికి మానవుడు తన ఆరాధనను కేవలం అల్లాహ్ (సు.తా.) కే ప్రత్యేకించుకొని, సత్కార్యాలు చేయాలి. అల్లాహుతా'ఆలాను తప్ప మరెవ్వరినీ ఆరాధ్యదైవాలుగా చేసుకోరాదు.

ఖురాన్ 1:7

صِرَٰطَ ٱلَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ ٱلْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا ٱلضَّآلِّينَ

తెలుగు లిపిలోసిరాతల్లదీన అన్అమ్త అలైహిమ్ గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్

నీవు అనుగ్రహించిన[1] వారి మార్గం (మాత్రమే చూపు) నీ ఆగ్రహానికి[2] గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.

వివరణలు

[1] అల్లాహ్ (సు.తా.) అనుగ్రహించిన వారి మార్గం అంటే, దైవప్రవక్తల, వారిని అనుసరించిన సత్పురుషుల మరియు పుణ్యపురుషుల మార్గం. వారు సన్మార్గం పొంది, దానిపైననే నడిచారు. అదే అల్లాహుతా'ఆలాకు విధేయులవటం (ఇస్లాం). అదే స్వర్గానికి అర్హులు చేసే మార్గం. అల్లాహ్ (సు.తా.) ఆదేశం: "మరియు ఎవరు అల్లాహుతా'ఆలాకు, మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ (సు.తా.) అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్యవంతులతోనూ, అల్లాహుతా'ఆలా ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరు(షహీద్)లతోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది." (4:69) [2] మ'గ్దూబి 'అలైహిమ్: అల్లాహ్ (సు.తా.) ఆగ్రహానికి గురైనవారు అంటే - యూదులు. ఎందుకంటే వారు బుద్ధిపూర్వకంగా సన్మార్గాన్ని త్యజించారు. దివ్యసూచనలను మార్చారు. 'ఉ'జైర్ ('అ.స.)ను, అల్లాహుతా'ఆలా కుమారుడు అన్నారు. తమ విద్వాంసుల (అ'హ్బారు) లకు ధర్మసమ్మతం ('హలాల్) మరియు నిషిద్ధం ('హరామ్) చేసే హక్కు ఉందన్నారు. 'దాల్లీన్: మార్గభ్రష్టులైనవారు - అంటే క్రైస్తవులు. ఎందుకంటే వారు 'ఈసా మసీ'హ్ (ఏసూ క్రీస్తు 'అ.స.)ను అల్లాహ్ (సు.తా.) కుమారుడు అని కొందరు మరియు ముగ్గురు ఆరాధ్యదైవా(Trinity)లలో ఒకరు అని మరికొందరు అన్నారు, (ఫ'త్హ్ అల్-ఖదీర్). ఆమీన్: ఓ అల్లాహ్ (సు.తా.)! మా దు'ఆ (ప్రార్థన)ను అంగీకరించు. సూరహ్ అల్ ఫాతి'హా తరువాత ఆమీన్ అనటాన్ని దైవప్రవక్త ('స'అస) ఎంతో ప్రాధాన్యత నిచ్చారు మరియు ఎంతో ఉత్తమమైనదని అన్నారు. దీనిని ముందు నిలిచి నమా'జ్ చేయించేవాడు (ఇమామ్) మరియు ఇమామ్ వెనుక నమా'జ్ చేసేవారు (ముఖ్త'దీలు) అందరూ అనాలి. పెద్ద స్వరంతో చదివే నమా'జ్ లలో పెద్ద స్వరంతో అనాలి (ఇబ్నె-మాజా, ఇబ్నె-కసీ'ర్).

మూలం: ఖురాన్ 1:1–7 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

2. సూరా అల్-ఇఖ్లాస్ — 4 ఆయత్‌లు

ఖురాన్ 112:1

قُلْ هُوَ ٱللَّهُ أَحَدٌ

తెలుగు లిపిలోఖుల్ హువల్లాహు అహద్

ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.[1]

వివరణలు

[1] అ'హదున్: The One and Alone, ఏకైకుడు.

ఖురాన్ 112:2

ٱللَّهُ ٱلصَّمَدُ

తెలుగు లిపిలోఅల్లాహుస్సమద్

ఎవరి అక్కరా లేని వాడు, (సర్వులూ ఆయనపైనే ఆధారపడతారు).[1]

వివరణలు

[1] అ'స్సమదు: Absolute, Eternal, Besought of All, to Whom obedience is rendered. Without whom no affair is accomplished సమస్త వ్యవహారాలు తన మీదనే ఆధారపడి ఉన్నవాడు, నిత్యుడు, శాశ్వతుడు, నిరంతరుడు. అందరూ ఆయనపై ఆధారపడి ఉన్నారు. ఆయనకు ఎవ్వరి అక్కర లేదు. ఆయన నిరపేక్షుడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.

ఖురాన్ 112:3

لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ

తెలుగు లిపిలోలమ్ యలిద్ వలమ్ యూలద్

ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.

ఖురాన్ 112:4

وَلَمْ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدٌۢ

తెలుగు లిపిలోవలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్

మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."[1]

వివరణలు

[1] లైస క మిస్'లిహీ షయ్ఉన్' 42:11. ఒక 'హదీస్'ఖుద్సీ: "మానవుడు నన్ను దూషిస్తాడు, అంటే నాకు సంతానాన్ని అంటగడతాడు. వాస్తవానికి నేను, ఒక్కడను, అద్వితీయుడను. ఎవరి అక్కరలేని వాడను, నేను ఎవ్వరినీ కనలేదు మరియు నేను కూడా ఎవ్వరికీ పుట్టలేదు. నాకు సరిసమానమైనవాడు గానీ నాతో పోల్చదగినవాడు గానీ ఎవ్వడూ లేడు," ('స. బు'ఖారీ).

మూలం: ఖురాన్ 112:1–4 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

3. సూరా అల్-ఫలఖ్ — 5 ఆయత్‌లు

ఖురాన్ 113:1

قُلْ أَعُوذُ بِرَبِّ ٱلْفَلَقِ

తెలుగు లిపిలోఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్

ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు (అల్లాహ్) యొక్క శరణు వేడుకుంటున్నాను.

ఖురాన్ 113:2

مِن شَرِّ مَا خَلَقَ

తెలుగు లిపిలోమిన్ షర్రి మా ఖలఖ్

ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;[1]

వివరణలు

[1] ఇక్కడ ప్రతి రకపు కీడునుండి శరణు కోరబడుతోంది. షైతానుల నుండి, నరకం నుండి మరియు మానవునికి హాని కలిగించే ప్రతిదాని నుండి.

ఖురాన్ 113:3

وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ

తెలుగు లిపిలోవమిన్ షర్రి గాసిఖిన్ ఇదా వఖబ్

మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో![1]

వివరణలు

[1] ఎందుకంటే చీకటిలోనే హానికరమైన జంతువులు, పాములు, తేళ్ళు బయటికి వస్తాయి. నేరస్థులు రాత్రిలోనే నేరాలు చేస్తారు. ఇక్కడ విధమైన అన్ని కీడుల నుండి శరణు కోరబడుతోంది.

ఖురాన్ 113:4

وَمِن شَرِّ ٱلنَّفَّـٰثَـٰتِ فِى ٱلْعُقَدِ

తెలుగు లిపిలోవమిన్ షర్రిన్నఫ్ఫాథాతి ఫిల్ ఉఖద్

మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి;[1]

వివరణలు

[1] అన్-నఫ్ఫాసా'తి: అంటే ముడుల మీద మంత్రించి ఊదేవారి కీడు నుండి.

ఖురాన్ 113:5

وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ

తెలుగు లిపిలోవమిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్

మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"[1]

వివరణలు

[1] 'హాసిదిన్: అసూయపడే వాడి కీడు నుండి కూడా శరణు కోరబడుతోంది.

మూలం: ఖురాన్ 113:1–5 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

4. సూరా అన్-నాస్ — 6 ఆయత్‌లు

ఖురాన్ 114:1

قُلْ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ

తెలుగు లిపిలోఖుల్ అఊదు బిరబ్బిన్నాస్

ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను![1]

వివరణలు

[1] రబ్బున్: పర్ వర్ దిగార్ (ఉర్దూ), పోషకుడు, చాలా మట్టుకు తెలుగు అనువాదాలలో ఈ పదానికి ప్రభువు అని అనువాదం చేశారు. మానవుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి వానిని సరిదిద్ది పోషిస్తాడు. మరియు అతని అంతిమ ఘడియ వరకు పోషిస్తాడు. కేవలం మానవుడే కాక సమస్త సృష్టికి కూడా పోషకుడు ఆయనే!

ఖురాన్ 114:2

مَلِكِ ٱلنَّاسِ

తెలుగు లిపిలోమలికిన్నాస్

మానవుల సార్వభౌముడు![1]

వివరణలు

[1] ఇటువంటి పోషకుడే వారి సార్వభౌముడు.

ఖురాన్ 114:3

إِلَـٰهِ ٱلنَّاسِ

తెలుగు లిపిలోఇలాహిన్నాస్

మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)!"

ఖురాన్ 114:4

مِن شَرِّ ٱلْوَسْوَاسِ ٱلْخَنَّاسِ

తెలుగు లిపిలోమిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్

కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి;

ఖురాన్ 114:5

ٱلَّذِى يُوَسْوِسُ فِى صُدُورِ ٱلنَّاسِ

తెలుగు లిపిలోఅల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్

ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో![1]

వివరణలు

[1] అల్-వస్ వాసు: అంటే మెల్లని ధ్వనితో మాట్లాడటం, గుసగుసలాడటం, షై'తాన్ కూడా మానవునికి తెలియకుండానే అతని హృదయంలో చెడ్డ ఆలోచనలు రేకెత్తిస్తాడు, ఇదే వస్ వస.
అల్-'ఖన్నాస్: నెమ్మదిగా జారుకునే వాడు, అంటే షై'తాన్.

ఖురాన్ 114:6

مِنَ ٱلْجِنَّةِ وَٱلنَّاسِ

తెలుగు లిపిలోమినల్ జిన్నతి వన్నాస్

వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు![1]

వివరణలు

[1] ఈ వస్ వస - చేసేవారు రెండు రకాల వారు. ఒకరు జిన్నాతులలోని షై'తానులు. అల్లాహ్ (సు.తా.) వాటికి మానవులను, మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షించే యుక్తిని ఇచ్చాడు. ప్రతి మానవుని వెంట ఒక షై'తాను ఉంటాడు. వాడు అతన్ని మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షిస్తూ ఉంటాడు. ఈ మాట విని ఒక 'స'హాబీ (ర'ది.'అ.) ఇలా అడిగారు: "ఓ ప్రవకా ('స'అస) ఏమీ? మీతో పాటు కూడా షై'తాన్ ఉన్నాడా?" అతను జవాబిచ్చారు: "అవును! ఉన్నాడు, కాని అల్లాహ్ (సు.తా.) నాకు వాడిపై ఆధిక్యతనిచ్చాడు అందుకని వాటు నాకు విధేయుడిగా ఉంటాడు. వాడు, నాక మేలు తప్ప మరొక విషయాన్ని ప్రోత్సహించడు." ('స'హీ'హ్ ముస్లిం)
రెండవ రకమైన షై'తాన్ లు మానవులలో ఉన్నారు. వారు, తాము మంచి ఉపదేశం ఇస్తున్నామని చెబుతూ మానవులను మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షిస్తూ ఉంటారు.
షైతాన్ మానవులనే కాక జిన్నాతులను కూడా మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షిస్తూ ఉంటాడని మరి కొందరి అభిప్రాయం.

మూలం: ఖురాన్ 114:1–6 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

5. సూరా అల్-కౌసర్ — 3 ఆయత్‌లు

ఖురాన్ 108:1

إِنَّآ أَعْطَيْنَـٰكَ ٱلْكَوْثَرَ

తెలుగు లిపిలోఇన్నా అఅతైనాకల్ కౌథర్

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము.[1]

వివరణలు

[1] కౌస'రున్: అంటే అధికం. ఇబ్నె-కసీ'ర్ ఇక్కడ: 'ఖైరున్ కసీ'రున్ - అత్యధికమైన మేలు - అనే అర్థానికి ప్రాధాన్యత నిచ్చారు. 'స'హీ'హ్ 'హదీస్'లో - కౌస'ర్ - అనేది స్వర్గంలో దైవప్రవక్తకు ప్రసాదించబడే ఒక సెలయేరు, అని చెప్పబడింది. మరి కొందరు అదొక సరోవరం అన్నారు. 'ఖైరున్ కసీ'రున్ అనే పదం వీటన్నింటినీ సూచిస్తుందని ఇబ్నె-కసీ'ర్ అంటారు.

ఖురాన్ 108:2

فَصَلِّ لِرَبِّكَ وَٱنْحَرْ

తెలుగు లిపిలోఫసల్లి లిరబ్బిక వన్హర్

కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు![1]

వివరణలు

[1] నమాజ్ మరియు బలి (ఖుర్బానీ) ఆ ఒకేఒక్క ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) కొరకే చేయాలి. న'హ్ర్ - అంటే ఒంటె మెడలో కత్తి పొడిచి దాని రక్తనాళం కోయటం. వేరే పశువులను భూమి మీద పడవేసి వాటి మెడ రక్తనాళాలను కోస్తారు. దీనిని - జిబ్'హా - అంటారు. ఇక్కడ న'హ్ర్, బలి (ఖుర్బానీ) అంటే 'హజ్జ్ లేక 'ఈద్-అ'ద్దుహా సందర్భంగా లేక 'సదఖ - దానం - కొరకు చేసే జి'బ్ హా'లు కూడా.

ఖురాన్ 108:3

إِنَّ شَانِئَكَ هُوَ ٱلْأَبْتَرُ

తెలుగు లిపిలోఇన్న షానిఅక హువల్ అబ్తర్

నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు.[1]

వివరణలు

[1] అబ్ తరు: అంటే వారసుడు లేకుండా పేరు ప్రతిష్ఠలు లేకుండా అయిపోవటం. అతన వెంటనే అతని వంశం అంతమవటం లేక అతని పేరు తీసుకొనేవాడు ఎవ్వడూ లేకపోటం. దైవప్రవక్త ('స'అల) కు మగ సంతానం బ్రతికి లేనందున అతని ('స'అస) విరోధులు అతనిని ('స'అసను) అబ్ తర్ అని ఎత్తి పొడిచేవారు. అప్పుడు అల్లాహ్ (సు.తా.) ఈ ఆయత్ అవతరింపజేశాడు. మరియు ఇది నిజమని నిరూపించాడు.

మూలం: ఖురాన్ 108:1–3 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

6. సూరా అల్-అస్ర్ — 3 ఆయత్‌లు

ఖురాన్ 103:1

وَٱلْعَصْرِ

తెలుగు లిపిలోవల్ అస్ర్

కాలం సాక్షిగా![1]

వివరణలు

[1] అల్లాహ్ (సు.తా.) తాను కోరిన దాని సాక్ష్యం తీసుకుంటాడు. కాని మానవుడు అల్లాహ్ (సు.తా.) తప్ప మరెవ్వరి సాక్ష్యం తీసుకోరాదు.

ఖురాన్ 103:2

إِنَّ ٱلْإِنسَـٰنَ لَفِى خُسْرٍ

తెలుగు లిపిలోఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్

నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు![1]

వివరణలు

[1] ఆ మానవుడు ఎవడైతే విశ్వసించడో మరియు సత్కార్యాలు చేయడో తన కాలాన్ని వృథా కాలక్షేపంలో, నిషేధించిన పనులు చేయటంలో పేరాసతో గడుపుతాడో! అలాంటి వాడు పరలోకంలో నరకాగ్నికి ఇంధనం అవుతాడు.

ఖురాన్ 103:3

إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَتَوَاصَوْا۟ بِٱلْحَقِّ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ

తెలుగు లిపిలోఇల్లల్లదీన ఆమనూ వఅమిలుస్సాలిహాతి వతవాసౌ బిల్ హఖ్ఖి వతవాసౌ బిస్సబ్ర్

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప![1]

వివరణలు

[1] ఇలాంటి నష్టం నుండి తప్పించుకోగల వారు ఎవరంటే: ఒకే ఒక్క ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు అల్లాహ్ (సు.తా.) ఆదేశాలను పాటించేవారు, అల్లాహ్ (సు.తా.) నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండేవారు, కష్టకాలంలో సహనం వహించి, సత్య ధర్మ ప్రచారం చేస్తూ ఉండేవారు.

మూలం: ఖురాన్ 103:1–3 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

7. సూరా అన్-నస్ర్ — 3 ఆయత్‌లు

ఖురాన్ 110:1

إِذَا جَآءَ نَصْرُ ٱللَّهِ وَٱلْفَتْحُ

తెలుగు లిపిలోఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్హ్

(ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)!

ఖురాన్ 110:2

وَرَأَيْتَ ٱلنَّاسَ يَدْخُلُونَ فِى دِينِ ٱللَّهِ أَفْوَاجًا

తెలుగు లిపిలోవరఅయ్తన్నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా

మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో![1]

వివరణలు

[1] చూడండి, 3:19.

ఖురాన్ 110:3

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَٱسْتَغْفِرْهُ ۚ إِنَّهُۥ كَانَ تَوَّابًۢا

తెలుగు లిపిలోఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్హు ఇన్నహూ కాన తవ్వాబా

అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు.[1]

వివరణలు

[1] అంటే నీ ధర్మ ప్రచారం ముగిసే సమయం వచ్చిందనుకో! కాబట్టి నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడటంలో మరియు ఆయన స్తోత్రం చేయటంలో మునిగి ఉండు. ప్రతివాడు తన జీవితపు చివరి దినాలలో, వృద్ధాప్యంలో వీలైనంత వరకు ప్రభువు ధ్యానంలో మునిగి ఉండటం ఉత్తమమని, దీని సందేశం.

మూలం: ఖురాన్ 110:1–3 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

8. సూరా అల్-కాఫిరూన్ — 6 ఆయత్‌లు

ఖురాన్ 109:1

قُلْ يَـٰٓأَيُّهَا ٱلْكَـٰفِرُونَ

తెలుగు లిపిలోఖుల్ యాఅయ్యుహల్ కాఫిరూన్

ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!

ఖురాన్ 109:2

لَآ أَعْبُدُ مَا تَعْبُدُونَ

తెలుగు లిపిలోలా అఅబుదు మా తఅబుదూన్

మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;

ఖురాన్ 109:3

وَلَآ أَنتُمْ عَـٰبِدُونَ مَآ أَعْبُدُ

తెలుగు లిపిలోవలా అన్తుమ్ ఆబిదూన మా అఅబుద్

మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.

ఖురాన్ 109:4

وَلَآ أَنَا۠ عَابِدٌ مَّا عَبَدتُّمْ

తెలుగు లిపిలోవలా అన ఆబిదుమ్మా అబత్తుమ్

మరియు మీరు ఆరాధించిన వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;

ఖురాన్ 109:5

وَلَآ أَنتُمْ عَـٰبِدُونَ مَآ أَعْبُدُ

తెలుగు లిపిలోవలా అన్తుమ్ ఆబిదూన మా అఅబుద్

మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.

ఖురాన్ 109:6

لَكُمْ دِينُكُمْ وَلِىَ دِينِ

తెలుగు లిపిలోలకుమ్ దీనుకుమ్ వలియ దీన్

మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"[1]

వివరణలు

[1] చూమీరు మీ ధర్మాన్ని వదలటానికి సిద్ధంగా లేనప్పుడు! నేను నా సత్యధర్మాన్ని ఎందుకు వదలాలి? చూడండి, 28:55.

మూలం: ఖురాన్ 109:1–6 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

9. సూరా అల్-మసద్ — 5 ఆయత్‌లు

ఖురాన్ 111:1

تَبَّتْ يَدَآ أَبِى لَهَبٍ وَتَبَّ

తెలుగు లిపిలోతబ్బత్ యదా అబీ లహబిన్ వతబ్బ్

అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక![1]

వివరణలు

[1] చూడండి, 15:23.

ఖురాన్ 111:2

مَآ أَغْنَىٰ عَنْهُ مَالُهُۥ وَمَا كَسَبَ

తెలుగు లిపిలోమా అగ్నా అన్హు మాలుహూ వమా కసబ్

అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు!

ఖురాన్ 111:3

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ

తెలుగు లిపిలోసయస్లా నారన్ దాత లహబ్

అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు!

ఖురాన్ 111:4

وَٱمْرَأَتُهُۥ حَمَّالَةَ ٱلْحَطَبِ

తెలుగు లిపిలోవమ్రఅతుహూ హమ్మాలతల్ హతబ్

మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ![1]

వివరణలు

[1] ఆమె దైవక్త ('స'అస) బాటలో ముండ్లు వేసేది. అతనికి విరుద్ధంగా చాడీలు చెప్పేది. చూడండి, 15:23.

ఖురాన్ 111:5

فِى جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍۭ

తెలుగు లిపిలోఫీ జీదిహా హబ్లుమ్మిమ్మసద్

ఆమె మెడలో బాగా పేనిన ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది.[1]

వివరణలు

[1] జీదున్: మెడ మసదున్: ఖర్జూరపు నారతో బాగా పేనిన గట్టి త్రాడు.

మూలం: ఖురాన్ 111:1–5 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

10. సూరా అల్-ఫీల్ — 5 ఆయత్‌లు

ఖురాన్ 105:1

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَـٰبِ ٱلْفِيلِ

తెలుగు లిపిలోఅలమ్ తర కైఫ ఫఅల రబ్బుక బిఅస్హాబిల్ ఫీల్

ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?

ఖురాన్ 105:2

أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِى تَضْلِيلٍ

తెలుగు లిపిలోఅలమ్ యజ్అల్ కైదహుమ్ ఫీ తద్లీల్

ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?[1]

వివరణలు

[1] అంటే కాబాను పడగొట్టాలనే వారి కుట్రను భంగం చేయలేదా? అని.

ఖురాన్ 105:3

وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ

తెలుగు లిపిలోవఅర్సల అలైహిమ్ తైరన్ అబాబీల్

మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;

ఖురాన్ 105:4

تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ

తెలుగు లిపిలోతర్మీహిమ్ బిహిజారతిమ్మిన్ సిజ్జీల్

అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి;[1]

వివరణలు

[1] చూడండి, 11:82.

ఖురాన్ 105:5

فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍۭ

తెలుగు లిపిలోఫజఅలహుమ్ కఅస్ఫిమ్మఅకూల్

ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు.

మూలం: ఖురాన్ 105:1–5 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

11. సూరా ఖురైష్ — 4 ఆయత్‌లు

ఖురాన్ 106:1

لِإِيلَـٰفِ قُرَيْشٍ

తెలుగు లిపిలోలిఈలాఫి ఖురైష్

(అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటు పడ్డారు.

ఖురాన్ 106:2

إِۦلَـٰفِهِمْ رِحْلَةَ ٱلشِّتَآءِ وَٱلصَّيْفِ

తెలుగు లిపిలోఇలాఫిహిమ్ రిహ్లతష్షితాఇ వస్సైఫ్

(అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు.[1]

వివరణలు

[1] ఈలాఫున్: అలవాటు పడటం, సురక్షితంగా కొనసాగించటం. ఖురైషుల ముఖ్య వృత్తి వ్యాపారం. వారు శీతాకాలంలో యమన్ కు మరియు వేసవి కాలంలో సిరియాకు వ్యాపారానికి పోయేవారు. వారు కా'బా నిర్వాహకులు కావటం వల్ల వారి వాణిజ్య బృందాలు ఎలాంటి ఆటంకం, అపాయం లేకుండా ప్రయాణం చేయగలిగేవి.

ఖురాన్ 106:3

فَلْيَعْبُدُوا۟ رَبَّ هَـٰذَا ٱلْبَيْتِ

తెలుగు లిపిలోఫల్యఅబుదూ రబ్బ హాదల్ బైత్

కావున వారు ఈ గృహం (కఅబహ్) యొక్క ప్రభువు (అల్లాహ్) ను మాత్రమే ఆరాధించాలి![1]

వివరణలు

[1] చూడండి, 2:125. అంటే ఒకే ఒక్క ఆరాధ్యుడు అయిన అల్లాహ్ (సు.తా.) వారిని సురక్షితంగా వ్యాపారం చేయనిచ్చినందుకు వారు ఆయనను మాత్రమే ఆరాధించాలి. బహుదైవారాధనను త్యజించాలి.

ఖురాన్ 106:4

ٱلَّذِىٓ أَطْعَمَهُم مِّن جُوعٍ وَءَامَنَهُم مِّنْ خَوْفٍۭ

తెలుగు లిపిలోఅల్లదీ అత్అమహుమ్మిన్ జూఇన్ వఆమనహుమ్మిన్ ఖౌఫ్

వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు.[1]

వివరణలు

[1] వారిని ప్రమాదం నుండి కాపాడేవాడు మరియు వారిని పోషించేవాడు కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే కానీ - వారు పూజించే నిస్సహాయులైన - విగ్రహాలు గానీ, ఇతర కల్పిత దైవాలు గానీ కావు. గనుక వారు వాటి ఆరాధనను మానుకోవాలి. ఇంకా చూడండి, 2:126.

మూలం: ఖురాన్ 106:1–4 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

12. సూరా అల్-మాఊన్ — 7 ఆయత్‌లు

ఖురాన్ 107:1

أَرَءَيْتَ ٱلَّذِى يُكَذِّبُ بِٱلدِّينِ

తెలుగు లిపిలోఅరఅయ్తల్లదీ యుకద్దిబు బిద్దీన్

తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?[1]

వివరణలు

[1] ఈ ఆయతు దైవప్రవక్త ('స'అస)ను సంభోదిస్తోంది. దీన్ - అంటే పునరుత్థాన (తీర్పు) దినం. చూడండి, 109:6.

ఖురాన్ 107:2

فَذَٰلِكَ ٱلَّذِى يَدُعُّ ٱلْيَتِيمَ

తెలుగు లిపిలోఫదాలికల్లదీ యదుఉల్ యతీమ్

అతడే అనాథులను కసరి కొట్టేవాడు;[1]

వివరణలు

[1] ఎందుకంటే అతడు పిసినారి, తీర్పుదినాన్ని విశ్వసించని వాడు మరియు ఇహలోకంలో చేసిన పుణ్యాలకు పరలోకంలో లభించే ప్రతిఫలాన్ని విశ్వసించని వాడు.

ఖురాన్ 107:3

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ

తెలుగు లిపిలోవలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్

మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.

ఖురాన్ 107:4

فَوَيْلٌ لِّلْمُصَلِّينَ

తెలుగు లిపిలోఫవైలుల్లిల్ముసల్లీన్

కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు![1]

వివరణలు

[1] అనాథులను కసిరి కొట్టేవారికి, ఆకలిగొన్న పేదలకు అన్నం పెట్టని వారికి, నమా'జ్ చేయని వారికి 'వైల్' అనే నరకమే నివాస స్థల మవుతుంది. ఎందుకంటే వారు కపట విశ్వాసులు, హృదయపూర్వకంగా కాక ఇతరులకు చూపటానికే నమా'జ్ చేసేవారు.

ఖురాన్ 107:5

ٱلَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ

తెలుగు లిపిలోఅల్లదీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్

ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో![1]

వివరణలు

[1] ఇలాంటి వారు అసలు నమా'జ్ చేయరు. ఒకవేళ చేసినా అశ్రద్ధతో చేస్తారు, నిర్ణీత సమయంలో చేయరు. భయభక్తులతో నమా'జ్ చేయరు. చూడండి, 4:142.

ఖురాన్ 107:6

ٱلَّذِينَ هُمْ يُرَآءُونَ

తెలుగు లిపిలోఅల్లదీన హుమ్ యురాఊన్

ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)![1]

వివరణలు

[1] అంటే ఇతరులతో ఉన్నప్పుడు వారి మెప్పు పొందటానికి నమా'జ్ చేస్తారు. ఏకాంతంలో ఉంటే నమా'జ్ ను వదలి పెడతారు.

ఖురాన్ 107:7

وَيَمْنَعُونَ ٱلْمَاعُونَ

తెలుగు లిపిలోవయమ్నఊనల్ మాఊన్

మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో![1]

వివరణలు

[1] మ'అనున్: అంటే కొద్దిపాటి సామాన్య చిన్న చిన్న సహాయాలు. ఇంట్లో వాడే వస్తువులను ఒకరి కొకరు ఇచ్చుకోవటం. చిన్న చిన్న సహాయాలు చేసుకోవటం.

మూలం: ఖురాన్ 107:1–7 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: quran-align

మాషా అల్లాహ్! అభినందనలు!
ఈ పాఠాల్లో మీరు మొత్తం 1281 ఖురాన్ పదాలు మరియు ఈ సూరాల్లోని 58 ఆయత్‌లు చదివే అభ్యాసం చేశారు. ఇక ఖురాన్ చదవడం ఆరంభించండి! గుర్తుంచుకోండి — ఖురాన్‌ను అవతరించిన విధంగా పఠించడానికి తజ్వీద్ నియమాలు కూడా నేర్చుకోవాలి; అందుకు ఒక ఉపాధ్యాయుని వెతకండి.

ఖురాన్ చదవండి — అన్ని సూరాలు

అసెస్‌మెంట్

ఈ పాఠం నుండి 12 ప్రశ్నలు అడగబడతాయి (చదవడం, విని గుర్తించడం, నియమాలు). తర్వాతి పాఠానికి వెళ్లడానికి కనీసం 10 సరైన సమాధానాలు అవసరం. తప్పితే మళ్లీ ప్రయత్నించవచ్చు — ప్రతిసారి ప్రశ్నలు మారతాయి.

అరబీ పాఠం: Tanzil.net (CC BY 3.0) • తెలుగు అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com v1.0.8-csv.1 • పఠనం: Mishary Rashid Alafasy — EveryAyah.com • పద సమయాలు: Collin Fair, quran-align (CC BY 4.0) • తెలుగు లిపి: కంప్యూటర్ నియమాల ప్రకారం (సహాయం మాత్రమే) • మూలాలు & క్రెడిట్స్ • కాపీరైట్

తర్వాతి పాఠానికి వెళ్లడానికి, పైన ఉన్న అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణులు కావాలి.