తెలుగులో ఇస్లాం
నమాజ్ సమయాలుఅన్ని సమయాలు

వారసత్వ కాలిక్యులేటర్

1. మరణించినవారు పురుషుడా, స్త్రీయా?

2. బ్రతికి ఉన్న వారసులు ఎవరు?

ఉన్నవారికి + నొక్కండి.

భార్యలు (గరిష్ఠం 4)
కొడుకులు
కూతుళ్లు
తండ్రి
తల్లి
సొంత సోదరులు
సొంత సోదరీమణులు

3. ఆస్తి (ఐచ్ఛికం)

అంత్యక్రియల ఖర్చు, అప్పులు, వీలునామా
పరిధి మరియు లెక్కింపు నియమాలు
పరిధి: ఈ కాలిక్యులేటర్ సాధారణ సందర్భాలకే: భర్త/భార్యలు, కొడుకులు, కూతుళ్లు, తండ్రి, తల్లి, నిజ సోదరులు, నిజ సోదరీమణులు. మనవలు, తాత-నాయనమ్మలు, సవతి/అర్ధ సోదరులు, పినతండ్రులు, ఇతర బంధువుల కేసులను ఇది లెక్కించదు. అలాంటి కేసులకు, లేదా భిన్నాభిప్రాయాలు ఉన్న చోట, పండితుని సంప్రదించండి.
ఈ లెక్క ఎలా వచ్చింది: భాగాలు ఖురాన్ సూరహ్ అన్-నిసా ఆయతులు 11, 12, 176 లోని నియమాల ప్రకారం: సంతానం ఉంటే తల్లిదండ్రులకు ఒక్కొక్కరికీ ఆరో భాగం; భర్తకు సంతానం లేకపోతే సగం, ఉంటే నాలుగో భాగం; భార్య(ల)కు సంతానం లేకపోతే నాలుగో భాగం, ఉంటే ఎనిమిదో భాగం; ఒక కూతురికి సగం, ఇద్దరు లేదా ఎక్కువమందికి మూడింట రెండు భాగాలు; కొడుకు-కూతురు ఉంటే పురుషునికి స్త్రీ కంటే రెట్టింపు; సంతానం లేని వ్యక్తికి (కలాలా) ఒక సోదరి ఉంటే సగం, ఇద్దరికి మూడింట రెండు భాగాలు.
ఆయతుల్లో నేరుగా చెప్పని వివరాలను ఎక్కువమంది పండితుల అభిప్రాయం ప్రకారం వాడాను: సంతానం లేనప్పుడు తండ్రికి మిగిలినదంతా; కొడుకు లేదా తండ్రి ఉంటే సోదరులు/సోదరీమణులకు వాటా లేదు; కూతురు ఉన్నప్పుడు సోదరీమణులకు మిగిలినది; భర్త/భార్య, తల్లి, తండ్రి ఉన్న ప్రత్యేక సందర్భంలో తల్లికి భర్త/భార్య భాగం తర్వాత మిగిలిన దానిలో మూడో వంతు (ఉమరియ్యతాన్); భాగాల మొత్తం ఒకటి కంటే ఎక్కువైతే అందరికీ దామాషా ప్రకారం తగ్గింపు (అవ్ల్); భాగాల తర్వాత ఆస్తి మిగిలి, ఇతర వారసులు లేకపోతే భర్త/భార్య మినహా మిగతావారికి దామాషా ప్రకారం తిరిగి ఇవ్వడం (రద్ద్). ఈ చివరి రెండు నియమాల్లో, ఉమరియ్యతాన్‌లో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.