ప్రశ్న: రమజాన్లో రోజా విరమించే సరైన సమయం ఏది?
సమాధానం: సూర్యాస్తమయం అయిన వెంటనే, అంటే మగ్రిబ్ సమయం ప్రవేశించగానే ఇఫ్తార్ చేయాలి. ఆలస్యం చేయకుండా త్వరగా విరమించడం మంచిది.
أُحِلَّ لَكُمْ لَيْلَةَ ٱلصِّيَامِ ٱلرَّفَثُ إِلَىٰ نِسَآئِكُمْ ۚ هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ ۗ عَلِمَ ٱللَّهُ أَنَّكُمْ كُنتُمْ تَخْتَانُونَ أَنفُسَكُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنكُمْ ۖ فَٱلْـَٔـٰنَ بَـٰشِرُوهُنَّ وَٱبْتَغُوا۟ مَا كَتَبَ ٱللَّهُ لَكُمْ ۚ وَكُلُوا۟ وَٱشْرَبُوا۟ حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ ٱلْخَيْطُ ٱلْأَبْيَضُ مِنَ ٱلْخَيْطِ ٱلْأَسْوَدِ مِنَ ٱلْفَجْرِ ۖ ثُمَّ أَتِمُّوا۟ ٱلصِّيَامَ إِلَى ٱلَّيْلِ ۚ وَلَا تُبَـٰشِرُوهُنَّ وَأَنتُمْ عَـٰكِفُونَ فِى ٱلْمَسَـٰجِدِ ۗ تِلْكَ حُدُودُ ٱللَّهِ فَلَا تَقْرَبُوهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ ءَايَـٰتِهِۦ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ
తెలుగు లిపిలో:
ఉహిల్ల లకుమ్ లైలతస్సియామిర్రఫథు ఇలా నిసాఇకుమ్ హున్న లిబాసుల్లకుమ్ వఅన్తుమ్ లిబాసుల్లహున్న అలిమల్లాహు అన్నకుమ్ కున్తుమ్ తఖ్తానూన అన్ఫుసకుమ్ ఫతాబ అలైకుమ్ వఅఫా అన్కుమ్ ఫల్ ఆన బాషిరూహున్న వబ్తగూ మా కతబల్లాహు లకుమ్ వకులూ వష్రబూ హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యదు మినల్ ఖైతిల్ అస్వది మినల్ ఫజ్రి థుమ్మ అతిమ్ముస్సియామ ఇలల్లైలి వలా తుబాషిరూహున్న వఅన్తుమ్ ఆకిఫూన ఫిల్ మసాజిది తిల్క హుదూదుల్లాహి ఫలా తఖ్రబూహా కదాలిక యుబయ్యినుల్లాహు ఆయాతిహీ లిన్నాసి లఅల్లహుమ్ యత్తఖూన్
ఉపవాసపు రాత్రులందు మీకు మీ భార్యలతో రతిక్రీడ (రఫస్) ధర్మసమ్మతం చేయబడింది. వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు. వాస్తవానికి మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్ కు తెలుసు. కావున ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు మరియు మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్) చేయండి మరియు అల్లాహ్ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత చీకటి పడే వరకూ మీ ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి. కాని మస్జిదులలో ఏతికాఫ్ పాటించేటప్పుడు, మీరు మీ స్త్రీలతో సంభోగించకండి[1]. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు, కావున వీటి దరిదాపులకు కూడా పోకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞను ప్రజలకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా వారు భయభక్తులు కలిగి ఉంటారని!
వివరణలు
[1] (‘వారు మీ వస్త్రాలు’ అనే దానికి) చూడండి, 7:189. ఏ’తికాఫ్: అంటే మస్జిద్ లో అల్లాహ్ (సు.తా.) ను ధ్యానిస్తూ ఏకాంతంగా గడపటం. ఏ’తికాఫ్ పాటించేవారు స్త్రీలతో సంభోగించరాదు. కాలకృత్యాలకు తప్ప, మస్జిద్ విడిచి బయటికి పోరాదు. తోటివారితో అనవసరమైన మాట్లలో పడరాదు.
మూలం: ఖురాన్ 2:187 • అనువాదం: Abdurrahim ibn Muhammad — QuranEnc.com (v1.0.8-csv.1) • అరబీ పాఠం: Tanzil.net
عَنْ سَهْلِ بْنِ سَعْدٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «لَا يَزَالُ النَّاسُ بِخَيْرٍ مَا عَجَّلُوا الْفِطْرَ».
తెలుగు లిపిలో:
అన్ సహ్లి బ్ని సఅదిన్ రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్ లా యజాలున్నాసు బిఖైరిన్ మా అజ్జలుల్ ఫిత్ర్
సహ్ల్ బిన్ సఅ్’ద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఉపవాస విరమణలో త్వరపడినంత కాలం ప్రజలు శుభాన్ని కలిగి ఉంటారు.”
[ప్రామాణికమైన హదీథు] • [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] • మూలం: HadeethEnc.com (v1.29.0) — https://hadeethenc.com/te/browse/hadith/4438