عن أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «تَسَحَّرُوا، فَإِنَّ فِي السَّحُورِ بَرَكَةً».
ముఖ్య వాక్యం:
تَسَحَّرُوا، فَإِنَّ فِي السَّحُورِ بَرَكَةً
తెలుగు లిపిలో:
తసహ్హరూ ఫఇన్న ఫిస్సహూరి బరకహ్
అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: సహరీ భోజనం తినండి, ఎందుకంటే సహరీ భుజించటంలో శుభము ఉన్నది.
[ప్రామాణికమైన హదీథు] • [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] • మూలం: HadeethEnc.com (v1.29.0) — https://hadeethenc.com/te/browse/hadith/4498
రోజా ఉండాలనుకునేవారు ఫజ్ర్ సమయం ప్రవేశించే ముందు కొంచెం తినడం సున్నత్. అది కొద్దిగా అయినా సరే — ఒక ఖర్జూరం లేదా నీళ్లు కూడా చాలు. సహరీ సమయం ముగింపును మీ నగరానికి తగిన ఫజ్ర్ సమయంతో తెలుసుకోండి.